8 సార్లు ఎమ్మెల్యే.. ఇక లేరు!
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు(SP Senior Leader), మాజీ మంత్రి, మాజీ ప్రతిపక్ష నేత రామ్ గోవింద్ చౌదరి(Ram Govind Chaudhary) కన్నుమూశారు. 73 ఏళ్ల ఆయన లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్పీ మీడియా ఇన్‌ఛార్జ్ సుశీల్ పాండే తెలిపారు. రామ్ గోవింద్ చౌదరి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన ఆయన, అనంతరం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో(Uttar Pradesh Legislative Assembly) ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతితో సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. బల్లియా ప్రాంతానికి చెందిన చౌదరి రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషించారు. ఆయన మరణ వార్తతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు దిగ్భ్రాంతికి గురయ్యారు. లక్నోలో కన్నుమూసిన రామ్ గోవింద్ చౌదరికి సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ నివాళులర్పించారు.