4 September, 2026 | 12:42 AM

ఆత్మీయతతో తహసీల్దార్‌కు ఘన సన్మానం!

03-09-2026 | 11:34pm

రామాయంపేట,(విజయక్రాంతి): అధికారిక హోదాలకు అతీతంగా ఆత్మీయతను చాటుతూ రామాయంపేట తహసీల్దార్‌ రజనీకుమారి(Ramayampet Tehsildar Rajini Kumari) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధి–అధికారి మధ్య ఉన్న సత్సంబంధాలకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలు తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి.

జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామాయంపేట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్‌ మద్దెల మాధవి రమేష్‌ తహసీల్దార్‌ రజనీకుమారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం స్వీట్‌ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మాధవి మాట్లాడుతూ.. రజనీకుమారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఈ ఆత్మీయ సన్మానం కార్యాలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.