ఏందయ్య సామి.. ఈ ఫీలింగ్!

25-09-2026 | 05:10am

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) పెళ్లి తర్వాత కూడా తమ కెమిస్ట్రీతో సోషల్ మీడియాను షేక్ చేస్తు న్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పుర్ వేదికగా వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట, ప్రస్తుతం వెండితెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా పీరియా డిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమాలోని ‘ఏందయ్య సామి’ అనే రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట తాలూకు చిన్న క్లిప్‌ను రష్మిక తన అధికారిక ఇన్‌స్ట్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ భర్త విజయ్‌పై ఉన్న ప్రేమను చాటుకు న్నారు. ‘విజూ పూర్తిగా నావాడే అయినప్పటికీ.. ఆయనను చూస్తుంటే నాలో క్రష్ ఫీలింగ్ అస్సలు తగ్గడం లేదు. ఇది నిజంగా విచిత్రంగా ఉంది” అంటూ తన భర్త విజయ్ దేవర కొండపై తనకున్న అమితమైన ప్రేమను వ్యక్తపరిచారు.

దీనికి విజయ్ అంతే ప్రేమగా స్పందిస్తూ.. ‘నేను చాలా అదృష్టవం తుడిని. సినిమాలో ‘జయమ్మ’ పాత్రను నేను మిస్ అవుతాను కానీ, జీవితాంతం నువ్వు నా తోడుగా ఉంటావుగా‘ అని రీపోస్ట్ చేశారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత విజయ్, -రష్మిక కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ‘రణబాలి’పై భారీ అంచనాలున్నాయి. రాహుల్ సాంకృ త్యాన్ దర్శక త్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 1870ల నాటి మద్రాస్ కరవు నేపథ్యంలో సాగే పోరాట కథగా తెరకెక్కుతోంది. పెళ్లి తర్వాత ఈ జంట నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు థియేటర్లలో వీరి ఆన్‌స్క్రీన్ మ్యాజిక్‌ను చూడటానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రష్మిక పెట్టిన తాజా పోస్ట్ వారి బాండింగ్‌ను ప్రతిబింబిస్తూ నెట్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. 

మరిన్ని వార్తలు