రిలీజ్ డేట్‌పై రూమర్స్‌కు చెక్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సినిమా(Ranabaali Movie)కు రిలీజ్ డేట్ ఖరారైంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా టీ-సిరీస్ సమర్పణలో రూపొందుతోంది. ‘రణబాలి’ విడుదలపై వస్తున్న వాయిదా వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో వీరతిలకంతో యోధుడి గెటప్‌లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఆకట్టుకుంటున్నారు. తన ప్రజలు, మాతృభూమి కోసం పోరాడే రణబాలి పాత్రలో విజయ్ కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
అక్టోబర్ 16న విజయదశమి(Vijayadashami) సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన ‘ఏందయ్య సామీ..’ పాటకు మంచి స్పందన వచ్చిందని, విజయ్-రష్మిక కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని చిత్ర బృందం వెల్లడించింది. 19వ శతాబ్దపు నేపథ్యంతో, బ్రిటీష్ పాలన కాలంలో చోటుచేసుకున్న చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించామని, త్వరలో ట్రైలర్, మరిన్ని పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని మేకర్స్ స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ యోధుడి తరహా పాత్రలో కనిపించనుండటంతో ఆయన లుక్, క్యారెక్టర్‌పై ఆసక్తి నెలకొంది. రష్మిక కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.