ఎర్రచందనం స్మగ్లర్ల బీభత్సం
పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరులో ఎర్రచందనం(Red Sandalwood) స్మగ్లర్లు బీభత్సం సృష్టించారు. స్మగ్లర్ల(Smugglers) వాహనం ఫారెస్ట్ సిబ్బంది వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులు(Forest Beat Officers) తీవ్రంగా గాయపడ్డారు. నివేదికల ప్రకారం, అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఎర్రచందనం స్మగ్లర్లుగా అనుమానిస్తున్న నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చేజింగ్ జరిగింది. రెండు వాహనాలు బలంగా ఢీకున్నాయి. స్మగ్లర్ల వాహనంలో(Smugglers vehicle) ఉన్న ఐదుగురిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్లు తమిళనాడు(Tamil Nadu) కళ్లకురిచ్చి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రకాష్ సహా ముగ్గురు అటవీ సిబ్బందికి గాయాయల్యాయి. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి(Tirupati Ruia Hospital) తరలించారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.