6 September, 2026 | 1:06 PM

మాదారం ప్రధాన రహదారికి మరమ్మతులు

06-09-2026 | 11:26am

జిన్నారం సెప్టెంబర్ 6: గడ్డపోతారం మున్సిపాలిటీ(Gaddapotharam Municipality) పరిధిలోని మాదారం ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్(Vice Chairman Mahender Goud) తక్షణ చర్యలు చేపట్టారు. ఆర్‌అండ్ బి (R&B) అధికారులతో మాట్లాడి రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయిస్తున్నరు. ​ఈ సందర్భంగా మహేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, వారి అవసరాల కోసం తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. రహదారుల పునర్నిర్మాణం, ప్రజా సౌకర్యాలే తమ మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు మల్లేష్ ముదిరాజ్, స్వాతి గణేష్ సింగ్,కుతాడి నవీన్,   ఇతర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు