కేరళ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థులచే రోడ్డు భద్రతపై అవగాహన
రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) రుద్రంగి కేరళ గ్లోబల్ హై స్కూల్(Kerala Global High School) విద్యార్థులచే రోడ్డు భద్రతపై ర్యాలీ నిర్వహించారు. ఇందిరా చౌక్ లో ప్రకార్డులతో చిన్నారులు రోడ్డు భద్రతపై అవగహన కలిపించారు. ముఖ్య అతిథిగా పాల్గొని SI మోతిరామ్ మాట్లాడుతూ...విద్యార్థులు(students) స్కూల్ బస్సు సురక్షితంగా ఎక్కలని సూచించారు. వాహనదారుడు సురక్షితంగా ఉంటే అతని కుటుంబం సురక్షితంగా ఉన్నట్టే అని అన్నారు.
అలాగే విద్యార్థులు తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కలిపించాలని ద్విచక్రవాహనంపై వెళ్తే హెల్మెట్ తప్పకుండా ధరించాలని అలాగే కారులో వెళ్తే సిటు బెల్ట్ పెట్టుకోవాలని వాహనాలు అతివేగంగా నడపకూడదని అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడవద్దని మీ తల్లిదండ్రులకు మీ బంధువులకు వివరించి చెప్పలని విద్యార్థులకు సూచించారు.అత్యవసర సమయంలో 112 నంబర్ కు డయల్ చేయాలని కోరారు.విద్యార్థుల కొరిక మేరకు వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లతిక, స్కూల్ ఇంచార్జ్ నరిగే విజయ్, హెడ్ కానిస్టేబుల్ జగదీశ్వర్, హోమ్ గార్డ్ రాము,పాల్గొన్నారు.