శివనందినికి రూ.లక్ష ఉపకార వేతనం
25-09-2026 | 06:03pm
కల్లూరు, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): కల్లూరు బాలికల ఉన్నత పాఠశాలలో(Kallur Girls High School) 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో సత్తుపల్లి నియోజకవర్గంలో(Sathupalli Constituency) ప్రథమ స్థానం సాధించిన ఆర్. శివనందినికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్(Shriram Life Insurance) ఆధ్వర్యంలో రూ.లక్ష ఉపకార వేతనం(Scholarship) లభించింది. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో(Engineering Staff College) గురువారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల(Shiva Pratap Shukla) చేతుల మీదుగా ఆమె ఈ నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు శివనందినిని అభినందించారు.