ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆర్టీసీ ఎన్నికల ప్రచారం
- హయత్ నగర్, బండ్లగూడ డిపోల్లో ఎన్నికల ప్రచారం
- టీడబ్ల్యూయూ అభ్యర్థులను గెలిపించాలి
- టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 4 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో(LB Nagar Constituency) ఆర్టీసీ కార్మికుల సంఘాల ఎన్నికల(RTC workers union elections) ప్రచారం జోరందుకుంది. హయత్ నగర్, బండ్లగూడ ఆర్టీసీ డిపోల్లో(Hayathnagar and Bandlaguda RTC depots) ఆయా యూనియన్ల నాయకులు తమ అభ్యర్ధులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడబ్ల్యూయూ అభ్యర్థులను(TWU candidates) గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను కలిసి ప్రచారం చేస్తున్నారు. టీజీఎస్ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా హయత్ నగర్ -1 ,2 డిపోల్లో ఆదివారం ఉదయం కార్మికులను టీఎంయూ, టీడబ్ల్యూయూ, ఐఎన్టీయూసీ, ఎస్ డబ్ల్యూయూ నాయకులు కలిసి టీడబ్ల్యూయూ అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని భారీ మెజార్టీతో బాణం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి గారు మాట్లాడుతూ... తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం టీడబ్ల్యూయూ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ, ఐఎన్ టీయూసీ(సంజీవ్ రెడ్డి), టీఎంయూ (అశ్వత్థామరెడ్డి), ఎస్ డబ్ల్యూయూ (వీఎస్ రావు) బలపరిచిన టీడబ్లూయూ అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డికి మద్దతుగా అక్టోబర్ 9వ తేదీన జరుగనున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో కార్మికులు "బాణం" గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, వారి సంక్షేమం కోసం ప్రభుత్వంతో ఒప్పించి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి, హయత్ నగర్ డిపో 1, 2 గౌరవాధ్యక్షుడు, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డితోపాటు హయత్ నగర్ 1,2 డిపోల యూనియన్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.