14 July, 2026 | 4:39 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

మళ్లీ రికార్డు కనిష్ఠానికి రూపాయి

29-11-2024 12:00 AM

డాలరు మారకంలో 84.47కు తగ్గిన కరెన్సీ విలువ

ముంబై, నవంబర్ 28: గతవారం చవిచూసిన రికార్డు కనిష్ఠస్థాయిని రూపాయి గురువారం మరోసారి తాకింది. నవంబర్ 21న డాలరు మారకంలో రూపాయి 84.50 కొత్త కనిష్ఠస్థాయిని తాకిన తర్వాత క్రమేపీ 84,35 వద్దకు కోలుకున్నది. అయితే ఈ బుధ, గురువారాల్లో వేగంగా పడిపోయింది. 

యూఎస్ డాలర్ బలోపేతం అవు తున్నందున, భారత్‌తో సహా వర్థమాన దేశాల కరెన్సీలన్నీ పతనమవుతున్న  క్రమం లో రూపాయి క్షీణతను చవిచూస్తున్న సంగ తి తెలిసిందే. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో  (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ 84.49 రికార్డు కనిష్ఠస్థాయికి తగ్గింది.

చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 7 పైసల నష్టంతో 84.47 వద్ద నిలిచింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా తగ్గడం, విదేశీ సంస్థాగత ఇన్వెసర్లు పెద్ద ఎత్తున నిధుల్ని వెనక్కు తీసుకోవడం రూపాయి తాజా క్షీణతకు కారణమని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.