14 July, 2026 | 3:51 PM

Breaking News

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •  

హెల్త్ ఇన్సూరెన్స్‌లోకి ఎల్‌ఐసీ

29-11-2024 12:00 AM

మణిపాల్‌సిగ్నాలో వాటా కొనుగోలుకు చర్చలు

న్యూఢిల్లీ, నవంబర్ 28: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఈ దిశగా మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో 50 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఎల్‌ఐసీ చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్, యూఎస్‌కు చెందిన సిగ్నా కార్పొరేషన్‌ల మధ్య జాయింట్ వెంచర్ అయిన మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లో బెంగళూరు కేంద్రంగా కార్యకలా పాలు నిర్వహిస్తున్న మణిపాల్ గ్రూప్‌నకు 51 శాతం వాటా, సిగ్నాకు మిగిలిన 49 శాతం వాటా ఉన్నది.

ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఎల్‌ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఆ విభాగంలోకి ప్రవేశించాలన్న వ్యూహాన్ని ఇప్పటికే వెల్లడించింది. దాదాపు 50 శాతం వరకూ వాటాను తీసుకునేందుకు జరుగుతున్న చర్చలు ప్రస్తుతం ప్రాధ మికదశలో ఉన్నాయని,  రెండు పార్టీలు ఒక నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయని ఆ వర్గాలు తెలిపాయి.

ప్రాధమిక చర్చల ప్రకారం ఎల్‌ఐసీకి వాటా విక్రయించడానికి మణిపాల్ గ్రూప్, సిగ్నాలు వాటి వాటాలను తగినరీతిలో తగ్గించుకుంటాయి. ఒప్పందం ఖరారైతే మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.4,000 కోట్ల విలువ లభించవచ్చని అంచనా.