రూపాయి తదుపరి అడుగు ఎటు?

23-09-2026 | 10:12am

ముంబై: అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి(Rupee) స్వల్పంగా బలపడింది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో(Early trading) 5 పైసలు లాభపడి 95.57 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడం, ఆసియా కరెన్సీలు కొంత కోలుకోవడం రూపాయికి మద్దతుగా నిలిచాయి. ముడి చమురు ధరలు(Crude oil prices) తగ్గడం భారత్‌కు కీలకంగా మారింది. దిగుమతులపై ఆధారపడే దేశంగా, చమురు ధరలు తగ్గితే డాలర్లకు(US dollar) డిమాండ్ కొంత తగ్గే అవకాశం ఉండటంతో రూపాయిపై ఒత్తిడి తగ్గుతోంది.

అయితే రూపాయి ముందంజకు భౌగోళిక రాజకీయ పరిణామాలే కీలకంగా మారనున్నాయి. అంతర్జాతీయ పరిణామాల్లో మార్పులు, అమెరికా ఆర్థిక విధానాలు, మార్కెట్లలో పెట్టుబడిదారుల కదలికలు కరెన్సీ మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఫారెక్స్ ట్రేడర్లు(Forex traders) పేర్కొంటున్నారు. మరోవైపు, అమెరికా ఫెడ్ నిర్ణయాల తర్వాత డాలర్ బలపడటం రూపాయికి సవాలుగా మారుతోంది. అలాగే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోవడం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఒకవైపు చమురు ధరల పతనం, మరోవైపు బలపడుతున్న డాలర్, ఈ రెండు అంశాల మధ్య రూపాయి తదుపరి గమనం ఎలా ఉంటుందనేది ?మార్కెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు