న్యాయ పోరాటానికి సాకేత్ బాధితులు!

25-09-2026 | 05:05am

తమ విల్లాలను మార్ట్ గేజ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న బాధితులు 

ఇది మామూలు మోసం కాదని ఆవేదన 

పోలీసులు న్యాయం చేయలేకపోయారని ఆక్రోశం 

‘విజయ క్రాంతి’కథనంతో పలువురి మద్దతు 

మేడ్చల్ సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): తమ విల్లాలను మార్ట్ గేజ్ చేసి రుణం పొందిన సాకేత్ ఇంజనీర్స్ అండ్ డెవలపర్స్(Saketh Engineers and Developers)పై బాధితులు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. ఒక ఆస్తి కొనుగోలుదారు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బిల్డర్ కు, విక్రయించిన వారికి దానిని మరొకరికి మార్ట్ గేజ్ చేసే హక్కు లేదు.

ఇది కొనుగోలుదారులను మోసం చేయడం అ వుతుంది. ఈ మోసం బయటపడగానే సాకేత్ ఇంజనీర్స్ మొత్తం రుణం చెల్లించి, రిలీజ్ డీడ్ చేసి తాము చేసిన మోసాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించింది.

యజమానికి తెలియకుండా మార్ట్ గేజ్ చేశారంటే, మార్ట్ గేజ్ డాక్యుమెంట్ అమలైనప్పటినుంచి మో సం చేసినట్లు అవుతుందని, తర్వాత రుణం చెల్లించి రిలీజ్ చేసిన మోసం కింద వస్తుందని న్యాయానిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక ఈసీలో మార్ట్ గే జ్, రిలీజ్ ఎంట్రీలు వరుసగా రా వడం వల్ల ఆస్తి టైటిల్ చరిత్రకు రిమార్కు అవుతుంది. దీనివల్ల యజమానులు ఆస్తిని విక్రయించడానికి లేదా రుణం పొందడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో సాకేత్ చేసిన మోసాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

పోలీసులు న్యాయం చేయలేకపోయినా.....

తమకు పోలీసులు న్యాయం చేయలేకపోయినా న్యాయస్థానం న్యాయం చేస్తున్న ఆశా భావంతో బాధితులు ఉన్నారు. ఈ కేసులో పోలీసులు సరైన విచారణ చేయలేదని తెలుస్తోంది. ఫిర్యాదు వచ్చిన 90 రోజుల్లో వి చారణ జరిపి చార్జి సీటు వేయాలి. కానీ 90 రోజుల తర్వాత కేసు’వాస్తవంలో పొరపాటు’అని మూసివేశారు.

దీనికోసం ఇన్ని రోజులు ఎం దుకు జాప్యం చేశారని బాధితులు ప్ర శ్నిస్తున్నారు. పోలీసులకు అన్ని డాక్యుమెం ట్లు సమర్పించినప్పటికీ ఏకపక్షంగా వ్యవహరించారని అంటున్నారు. అన్ని ఆధారాల తో బాధితులు పోలీసులు, రిజిస్ట్రేషన్ అధికారులపై లోకాయుక్తకు ఫిర్యాదు చేసే యోచన లో ఉన్నారు. రిజిస్ట్రేషన్ అధికారులు ఈసీ చూడకుండా సాకేత్ కు అనుకూ లంగా మా ర్ట్ గేజ్ చేశారు. రిజిస్ట్రేషన్ అధికారులు సహకరించడంతో సాకేత్ కు రుణం లభించింది. 

సోల్డ్, అన్ సోల్ యూనిట్లు కీలక ఆధారం 

సాకేత్ ఇంజనీర్స్, విస్టా ఐటీసీఎల్ మధ్యకుదుర్చుకున్న డీడ్ ఆఫ్ హైపోతికేసన్ లో సోల్ యూనిట్లు, అన్సోల్ యూనిట్లు అని పేర్కొన్నారు. సోల్ యూనిట్స్ అంటే బుకిం గ్, సేల్ అగ్రిమెంట్, కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ మాత్రమే జరిగి రిజిస్టర్డ్ సేల్ డీడ్ జరగని యూనిట్లు. అన్సోల్ అంటే ఇప్పటివరకు విక్రయించని, విక్రయించడానికి ఒప్పందం జ రగని యూనిట్లు. సాకేత్, విష్ట ఐటీసీఎల్ మ ధ్య ఒప్పందంలో ఇది స్పష్టంగా ఉంది. ఇప్పటికే రిజిస్టర్ సెల్ డీడ్ జరిగిన ఏ యూనిట్ కూడా సోల్ యూనిట్, అన్ సోల్ యూనిట్ గా చూయించి మార్ట్ గేజ్ చేసే అధికారం లే దు. అయినప్పటికీ 2020 వరకు విక్రయించిన రిజిస్ట్రేషన్ అయిన విల్లాలను సోల్డ్, అ న్సోల్ యూనిట్లుగా చూయించి 2020 నుం చి 2025 వరకు మార్టి గేజ్ చేసి రుణాలు పొందారు.

‘విజయ క్రాంతి’కథనంతో పలువురి మద్దతు 

’విజయ క్రాంతి’దినపత్రికలో 22వ తేదీన’సాకేత్ బాధితులకు న్యాయం దక్కేనా?’ శీ ర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనం బాగా వైరల్ అయింది. వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఫోన్ చేసి బాధితులకు మ ద్దతు తెలిపారు. జరిగిన అన్యాయంపై పోరా టం చేయాలని తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. మరి కొంతమంది వాట్సాప్ లలో కామెంట్లు పెట్టారు. బాధితులకు మద్ద తు తెలిపిన వారిలో న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ఉన్నారు. వీరి మద్దతుతో బాధితులు ధైర్యంతో న్యాయ పోరాటానికి ముందుకెళ్తున్నారు.


మరిన్ని వార్తలు