శాంసంగ్ ఫోన్లకు భారీ షాక్
29-09-2026 | 08:07am
శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కంపెనీ అన్ని మోడళ్లపై గరిష్ఠంగా 17 శాతం వరకు ధరలను పెంచినట్లు సమాచారం. జనవరిలో రూ.87,999గా ఉన్న S26 (256GB) బేసిక్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.1,02,999కు చేరింది.
దీంతో S26 సిరీస్‌లోని అన్ని మోడళ్లు రూ.లక్షకు పైగా ధర పలుకుతున్నాయి. ఇక 1TB స్టోరేజ్‌తో వచ్చే S26 Ultra ధర రూ.2,14,999కు పెరిగింది. మెమొరీ చిప్‌లు, మదర్‌బోర్డులు, ఇతర కీలక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల ధరలు పెరగడంతో ఈ ధరల సవరణ చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.