నవ్వులు పంచే ‘గోల్డెన్ భాగ్యం’
హాస్యనటులు సత్య(Comedians Satya), యోగిబాబు(Yogi Babu) కలిసి ఓ కొత్త కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘రంగబలి(Rangabali)’ ఫేమ్ పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాలు బ్యానర్లపై నాగార్జునరెడ్డి, పవన్ బాసంశెట్టి నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ మూవీ టైటిల్ రివీల్ గ్లింప్స్‌ను(Movie Title Reveal Glimpses) విడుదల చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఈ గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఈ వీడియోలో సత్య, యోగిబాబు వైట్ అండ్ వైట్ ట్రెడిషనల్ లుక్‌లో స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చారు.
వీరి కథలో ప్రేమ, క్రైమ్, యాక్షన్ అంశాలు మిళితమై ఉంటాయని వెల్లడిస్తూ, సినిమా టైటిల్‌ను ‘గోల్డెన్ భాగ్యం’గా రివీల్ చేశారు. జయశ్రీ, అధిరాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుదర్శన్, కిశోర్ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్‌రెడ్డి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: పవన్ సీహెచ్; డీవోపీ: బబ్లూ అజు; ఎడిటర్: రవితేజ గిరిజాల; ఆర్ట్: కామేశ్.