స్కావెంజర్ల వేతనాలు వెంటనే చెల్లించాలి
టీపీటీఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం
కామారెడ్డి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో(Government school) విధులు నిర్వహిస్తున్న స్కావెంజర్లకు వేతనాలు(Wages for scavengers) చెల్లించకపోవడం పట్ల టిపిటిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల లింగం(Chintala Lingam) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో స్కావెంజర్లు ప్రతిరోజూ కీలకంగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారికి నెలల తరబడి జీతాలు అందకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
నాలుగు నెలలుగా స్కావెంజర్ల వేతనాలు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, ఇకపై ప్రతి నెలా వేతనాలు సకాలంలో చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్కావెంజర్ల సమస్యపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించి వారికి న్యాయం చేయాలని టిపిటిఎఫ్ కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున చింతల లింగం,ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డిలు కోరారు.