రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

24-09-2026 | 06:55pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఆత్యాపాత్య అసోసియేషన్(Nirmal District Athya Pathya Association) ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ మినిస్ట్రీడియంలో సీనియర్ పురుషులు, మహిళల ఎంపిక పోటీలను నిర్వహించారు. మంచి ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులను ఎంపిక చేసి అక్టోబర్ 11,12,13 జగిత్యాలలో జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల(state level competitions)కు పంపడం జరుగుతుందని నిర్వహకులు తెలిపారు. 

ముఖ్య అతిథులుగా  మాజీ మున్సిపల్ చైర్మన్ గండతీశ్వర్  విద్యావేత్త  దీక్ష కాలేజ్ ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి  జిల్లా ఎస్టియు కార్యదర్శి లక్ష్మణ్  అలాగే ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ లక్ష్మణ్  అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి సామ్యూల్ టిజిపేట కార్యదర్శి ఆత్యపాత్య అసోసియేషన్ అధ్యక్షులు వన్నెల భూమన్న టిజిపేట కోశాధికారి నచ్చేందర్, బిజెపిపేట సంయుక్త కార్యదర్శి పోశెట్టి భూమేష్ గిరి హనుమాన్లు సాయిరాజ్ ముఖేష్ ఆత్యపాత్యకార్యదర్శి సంజీవ్ కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు