పి ఆర్ టి యు జిల్లా సమావేశంలో పలు తీర్మానాలు
ముకరంపుర, సెప్టెంబర్ 20(విజయ క్రాంతి): వాగేశ్వరి డిగ్రీ కళాశాల ముకరంపుర యందు పి ఆర్ టి యు తెలంగాణ(PRTU Telangana) కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించారు.ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు టిపిసిసి అధికార ప్రతినిధి అయిన గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని పలు తీర్మానాలు చేశారు. ప్రభుత్వము పిఆర్సి ని వెంటనే అమలు, పెండింగ్ లో ఉన్న 6 డిఎ లు, సిపిఎస్ రద్దు చేసి, ఉద్యోగ,
ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానము వర్తింపు డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు మెమో నం 57 ప్రకారం పాత పెన్షన్, ఉపాధ్యాయులకు బదిలీలతో కూడిన పదోన్నతుల షెడ్యూల్ ఈ నెలలోనే విడుదల చేయాలని మొదలగు తీర్మానాలు చేశారు.ఈ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాతూరి రాజ్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగులవంచ చంద్రశేఖర్ రావు, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.