ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి కబడ్డీలో రామాయంపేటకు అగ్రస్థానం

25-09-2026 | 12:56pm

కబడ్డీ క్రీడలో రామాయంపేట జయభేరి!

SGF అండర్‌–14 బాలికల విభాగంలో జిల్లా స్థాయి ప్రథమ బహుమతి

రాయలపూర్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన.. అభినందనల వెల్లువ

రామాయంపేట:(విజయ క్రాంతి): మైదానంలో అడుగుపెట్టిన బాలికలు.. ప్రత్యర్థిపై దూసుకెళ్లిన ప్రతి అడుగులో పట్టుదల.. గెలుపే లక్ష్యంగా సాగిన పోరాటం.. చివరకు 21 మండలాలను వెనక్కి నెట్టి రామాయంపేట మండలం(Ramayampet Mandal) జిల్లా స్థాయి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. SGF జిల్లా స్థాయి బాలికల అండర్‌–14 కబడ్డీ పోటీల్లో(Kabaddi Competitions) రామాయంపేట జట్టు సత్తా చాటింది. ఈ విజయానికి రాయలపూర్ పాఠశాల విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జట్టులో భాగమైన రాయలపూర్ విద్యార్థులు కబడ్డీ మైదానంలో ప్రతిభ కనబరుస్తూ జట్టు విజయానికి కీలకంగా నిలిచారు. జిల్లా స్థాయిలో 21 మండలాల మధ్య జరిగిన పోటీలో రామాయంపేటకు మొదటి బహుమతి రావడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది.

విద్యార్థుల ప్రతిభకు అభినందనలు

రాయలపూర్ విద్యార్థులు(Students) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మండలానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ విమల అభినందనలు తెలిపారు. అలాగే గ్రామ సర్పంచ్ గట్టు సుశీలమ్మ, ఉప సర్పంచ్ గజం ప్రశాంత్ విద్యార్థులను అభినందిస్తూ.. క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పుస్తకాలతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటుతున్న రాయలపూర్ విద్యార్థులు.. గ్రామానికి గర్వకారణంగా నిలిచారు.

మరిన్ని వార్తలు