షాద్‎నగర్ నియోజకవర్గంలో 50డాటా సెంటర్లకు ప్లాన్

16-09-2026 | 01:47pm

ఇప్పటికే మూడు డాటా సెంటర్లకు అనుమతి

మరో డాటా సెంటర్ అనుమతికి సిద్ధం 

షాద్‎నగర్ ప్రజల భవిష్యత్తు ఇక అంధకారం

డాటా సెంటర్ల ఏర్పాటుకు ఇక్కడే స్కెచ్..! 

సీఎం రేవంత్ రెడ్డికి కావాల్సిన వారే ఇక్కడ "మకాం" 

షాద్‎నగర్ మీడియా సమావేశంలో పాలమూరు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి 

షాద్ నగర్ సెప్టెంబర్ 16(విజయక్రాంతి: షాద్ నగర్ నియోజక వర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున డేటా సెంటర్ల ఏర్పాటు.. దానికి అనుగుణంగా వందలాది ఎకరాల సమీకరణ అంశాలు షాద్ నగర్ నియోజకవర్గ ప్రజల భవిష్యత్తును అంధకారం చేయబోతున్నాయని, దీనికి ఇక్కడే స్కెచ్ వేస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్థానిక నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజక వర్గంలో మొత్తం "50 డాటా సెంటర్" లకు రంగం సిద్ధం చేస్తున్నారని స్థానిక బాలాజీ వెంచర్లో ఓ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అతి దగ్గర వ్యక్తి ఇక్కడ తర్జనభర్జనలు పడుతున్నారని భూసేకరణ తదితర అంశాలను పరిశీలిస్తున్నారని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. 

బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మించి దానిద్వారా ఈ డాటా సెంటర్లకు నీరు అందించే ప్రక్రియ కొనసాగుతుందన్న అనుమానాలను ఆయన బలపరిచారు.లక్ష్మీదేవిపల్లి డిపిఆర్ బయటపడితే మొత్తం కథ ప్రజలకు అర్థమవుతుందని అన్నారు.ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు.షాద్‎నగర్ నియోజకవర్గంలో ఇప్పటికే మూడు డాటా సెంటర్లు నిర్మాణం జరుగుతున్నాయని మరో డేటా సెంటర్‎కు అనుమతి సిద్ధంగా ఉందని నియోజకవర్గంలో ఇలా మొత్తం 50డాటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కుట్ర నడుస్తుందని అన్నారు.

ఇది ఎమ్మెల్యే స్థాయి చేజారిపోయిందని సీఎం లెవెల్లో ఇక్కడ డాటా సెంటర్ల ఏర్పాటుకు పక్క ప్లాన్ జరుగుతుందన్నారు.బాలాజీ వెంచర్‎లో ఓ యింట్లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అతి సమీప వ్యక్తి ఇక్కడే రాకపోకలు కొనసాగిస్తూ భూముల కూర్పు డాటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు అంశాలను పరిశీలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉండే వ్యక్తి అని తెలిపారు.లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ తాగునీటి కోసమా..? సాగునీటి కోసమా..? లేక డేటా సెంటర్ల నిర్వహణ కోసమా తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందన్నారు. 

మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు రిజర్వాయర్ పరిమాణం ఎంత టిఎంసి నీటిని ఇక్కడ నిలువ చేయబోతుంది.. ఇందులో తాగు సాగునీటి వాటా ఎంత డిపిఆర్ బయటపెట్టాలని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై బోగస్ మాటలు మాట్లాడుతుందని అన్నారు.చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై చేతులెత్తేసిన ప్రభుత్వం.

చటాన్‎పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్థిక వనరులు సమకూర్చలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు 90కోట్ల రూపాయలు నిర్మాణానికి మంజూరు చేశామని చెప్పారని,ఆ తరువాత ఆ పనులు నచ్చక ఆ విధివిధానాల నచ్చక స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా మరో 190కోట్లు అదనంగా కేటాయించబోతున్నట్లు ప్రకటించారని.. పనులు నెల రోజుల్లో ప్రారంభిస్తామని 2024 లో చెప్పారని ప్రభుత్వం వచ్చి రెండు నెలలు దాటుతున్న హామీ ఎక్కడ అమలు కాలేదని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో మోహన్ సింగ్, ఇస్నాతి శ్రీనివాస్, అత్తాపూర్ మహేందర్,కాసోజి శివ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు