6 September, 2026 | 9:44 PM

అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు-ఎస్పై

06-09-2026 | 06:22pm

బోధన్ సెప్టెంబర్ 06 (విజయ క్రాంతి): సాలూర మండలం(Salur Mandal) మందర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‎ను బోధన్ రూరల్ పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మార్గమధ్యంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‎ను పట్టుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు