సర్పంచులను సన్మానించిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

16-09-2026 | 03:58pm

మంథని,(విజయక్రాంతి): మల్హర్‌రావు మండలాలకు చెందిన పలువురు నూతన సర్పంచులను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్(Single Window Chairman Kotha Srinivas) బుధవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. మొట్టమొదటిసారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (Primary Agricultural Cooperative Society) మంథనికి విచ్చేసిన సందర్భంగా పెద్దతుండ్ల సర్పంచ్ బండారి నర్సింగ  రావు, పుట్టపాక సర్పంచ్ కన్నూరి రాజబాబు, మల్లారం సర్పంచ్ పొట్ల లక్ష్మీ శ్రీకాంత్‌లను కొత్త శ్రీనివాస్ శాలువాలతో సత్కరించారు. 

ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్ కిషన్ రెడ్డి, వార్డు మెంబర్ కన్నూరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు