చర్లలో ఘనంగా పోషణ మాసం

16-09-2026 | 05:15pm

టేక్ హోమ్ రేషన్ వంటకాలపై అవగాహన కార్యక్రమం

చర్ల, (విజయక్రాంతి): పోషణ మాసం 2026 లో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ చర్ల ఆధ్వర్యంలో ఆర్. కొత్తగూడెం సెక్టార్ పరిధిలోని ఆర్. కొత్తగూడెం గ్రామ పంచాయతీలో టేక్ హోమ్ రేషన్  వంటకాల రెసిపీల ప్రచారం మరియు తయారీ విధానంపై అవగాహన కార్యక్రమం(Awareness Program) బుధవారం ఘనంగా నిర్వహించారు.

గర్భిణీలు, బాలింతలు మరియు 6 నెలల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు టేక్ హోమ్ రేషన్  యొక్క పోషక విలువలు, వంట తయారీ విధానాలు, సరైన వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు ఎస్ ఎన్ పి మెనూ బోర్డుల ద్వారా వివిధ టేక్ హోమ్ రేషన్  రెసిపీలను ప్రదర్శించి, వాటి తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా వివరించారు. టేక్ హోమ్ రేషన్  ను వృధా చేయకుండా పిల్లలకు రుచికరంగా, పోషకవంతంగా ఎలా అందించాలో తల్లులకు సూచించారు. టేక్ హోమ్ రేషన్  ద్వారా తల్లులు, పిల్లల్లో రక్తహీనతను నివారించవచ్చని, సరైన పోషణతో ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, సెక్టార్ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, టేక్ హోమ్ రేషన్  లబ్ధిదారులు, గర్భిణీలు, బాలింతలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు