పాలజ్ గణపతికి ప్రత్యేక బస్సులు

16-09-2026 | 05:23pm

నిర్మల్(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ నిర్మల్ డిపో(TG RTC Nirmal depot) ద్వారా పాలజ్ లో గల కర్ర గణపతి(karra ganapathi) దర్శనానికి వెళ్ళడానికి భక్తుల కొరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే.పండరి తెలిపారు. నిర్మల్ నుండి ఛార్జి  పెద్దలకు రూ.140/- పిల్లలకు రూ.90/- ఉంటుందని ఆయన తెలిపారు. మహిళలకు మహాలక్షి ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ఆయన తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు మన నిర్మల్ బస్టాండ్ లో గల స్టేషన్ మేనేజర్ 7382842265 లో సంప్రదించాలని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు