సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ రావు కన్నుమూత
16-09-2026 | 05:23pm
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామ మాజీ సర్పంచ్ మాదారపు సత్యనారాయణరావు బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆయన చికిత్స పొందుతూ వెంకటగిరి గ్రామంలో ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు గురువారం వెంకటగిరిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.