నగరంపల్లిలో ఘనంగా పోషణ మాసోత్సవాలు
చిన్నారులకు అక్షరాభ్యాసం
గణపురం, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మండలంలోని నగరంపల్లి గ్రామంలో బేటీ బచావో–బేటీ పడావో, పోషణ మాసోత్సవం, తల్లిపాల ప్రాముఖ్యత, మహిళా సాధికారత, బాల్య వివాహాల నివారణ(Prevention of Child Marriages)పై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కొడారి హైమావతి ధనుంజయ ముఖ్యఅతిథిగా హాజరుకాగా సూపర్వైజర్ అరుణ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం డి హెచ్ ఈ డబ్ల్యూ ప్రతినిధులు బాలికలు, మహిళలు, చిన్నారులకు ఆరోగ్యం, పోషణ, విద్య, భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ హైమావతి చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ హైమావతి సూపర్వైజర్ అరుణ లు మాట్లాడుతూ మహిళలు, బాలికలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం చిన్ననాటి నుంచే పౌష్టికాహారం అందించడం ఎంతో అవసరమన్నారు. పోషకాహార లోపం, రక్తహీనత నివారణకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెండర్ స్పెషలిస్ట్ అనూష, క్రిష్ణ సురేష్, మమత, అంగన్వాడీ టీచర్లు అనూష, కరుణ, కోమల, భూక్య విజయ, తదితరులు పాల్గొన్నారు.