సినీ ప్రముఖులకు షాక్

11-09-2026 | 02:56pm

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల 'ప్రత్యేక సమగ్ర సవరణ' (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా, హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu), విజయ్ దేవరకొండ, మాజీ భారత బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) నోటీసులు జారీ చేశారు. వీళ్లతో పాటు నటుడు మహేష్ బాబు, అతని భార్య నమ్రత, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నటుడు వెంకటేష్ దగ్గుబాటి(Daggubati Venkatesh), అతని కుమార్తెలు, ఆనంద్ దేవరకొండ, క్రీడాకారులు సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్, ఫార్మా టైకూన్ మురళీ కృష్ణ ప్రసాద్ దివి, నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు నోటీసులు అందినట్లు సమాచారం.

ఈ నోటీసులు ఓటర్ల జాబితా(Voter List) సరిచూసే ప్రక్రియలో భాగమని అధికారులు తెలిపారు.  ఓటరు కార్డులో పేర్లు, తల్లిదండ్రుల పేర్లలో వ్యత్యాసాలు ఉండటం, అలాగే ఓటరు వివరాలను గతంలోని SIR రికార్డులతో సరిపోల్చలేకపోవడం వంటివి దీనికి కారణాలుగా పేర్కొనబడ్డాయి. నోటీసులు అందుకున్న వారు ధృవీకరణ కోసం హాజరై, అవసరమైన పత్రాలను సమర్పించవచ్చని, ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని సరిచేయాలని కోరవచ్చని ఎన్నికల అధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు