కుటుంబకలహాలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ఘట్ కేసర్, సెప్టెంబర్ 20,(విజయక్రాంతి): కుటుంబ కలహాల కారణంగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని(Software employee) ఆత్మహత్య చేసుకున్న సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్(Pocharam IT Corridor Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోచారం డివిజన్ సంస్కృతి టౌన్ షిప్(Pocharam Division Sanskriti Township) సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న సంతోష (26) సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతురాలి భర్త కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది.