సోమిని రోడ్డు బురదమయం.. విద్యార్థులకు తప్పని తిప్పలు

25-09-2026 | 06:43pm

బెజ్జూర్ సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి ): బెజ్జూరు మండలం సోమిని కి వెల్లే రోడ్డు బురదమయంగా మారడంతో స్కూల్ పిల్లలు(School children), గిరిజన గ్రామాల ప్రజలు(tribal villages People) ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. వర్షాలకు రోడ్డు పూర్తిగా బురదమయమై గుంతల్లో నీరు నిలిచింది. వాహనాలు వెళ్లలేకపోతున్నాయి, పాఠశాలకు వెళ్లే చిన్నారులు బురదలోనే నడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన గిరిజన గ్రామాల ప్రజల రహదారుల తిప్పలు మాత్రం తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓర్రెలపై వంతెనలు మంజూరు ప్రజల తిప్పలను తీర్చాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు