సఫారీలదే ట్రై సిరీస్
07-09-2026 | 05:20am
ఫైనల్లో జింబాబ్వే చిత్తు
విండ్‌హోక్, సెప్టెంబర్ 6: నమీబియా వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్‌ను దక్షిణాఫ్రికా(South Africa) కైవసం చేసుకుంది. ఫైనల్లో సఫారీ జట్టు 48 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ 29 బంతుల్లో 53 పరుగులతో రాణించగా, డెవాల్ బ్రెవీస్ 32 పరుగులు చేశాడు. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టును సౌతాఫ్రికా బౌలర్లు మొదటి నుంచే దెబ్బతీశారు. 18 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ జోన్ ఫార్చూన్ (3/24), డువాన్ జాన్సెన్ (3/38) చెరో మూడు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించారు.






