సోమనాథ్, ద్వారకా యాత్ర ప్రత్యేక బస్సు
ఖానాపూర్ (విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో(RTC Nirmal Depot) ఆధ్వర్యంలో అక్టోబర్ 2 రోజు మధ్యాన్నం ఒంటి గంటకు గుజరాత్ రాష్ట్రంలో గల దేశంలో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగంకు ప్రత్యేక సూపర్ లగ్జరి పుష్ బ్యాక్ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజట్ కే.పండరి(Depot Manager K. Pandari) తెలిపారు.
ఈ యాత్ర బస్సు మొత్తం 6 జ్యోతిర్లింగాలు మొత్తం 14 పుణ్యక్షేత్రాలు దర్శించుకునే అవకాశం నిర్మల్ ఆర్టీసీ కలిపిస్తుందని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన తెలిపారు. ఈ యాత్ర మహారాష్ట్రలో గల అవుండా నాగ్ నాథ్, భద్ర మారుతి, గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా, శని సింగ్నపూర్, షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, గుజరాత్ లోగల నిష్కాలన్ష్ మహాదేవ్ మందిర్ ఇది సముద్రంలో ఉంటుంది.
సోమనాథ్ జ్యోతిర్లింగం, ద్వారకా శ్రీ కృష్ణుడు ఏలిన రాజ్యం, నాగ నాగేశ్వర్ జ్యోతిర్లింగం, మధ్య ప్రదేశ్ లో గల ఉజ్జాయిని జ్యోతిర్లింగం, ఓంకారెశేశ్వర్ జ్యోతిర్లింగం ఇంకా మార్గ మధ్యలో ఉన్న ఆలయాలు దర్శించుకునే అవకాశం మేము కలిపిస్తాము. ఈ బస్సు అక్టోబర్ 2న బయలు దేరి అక్టోబర్ 8 న నిర్మల్ చేరుకొనును. 2 అక్టోబర్ సమయం మ!! 1 గం!! 7 రోజుల యాత్ర ఛార్జి ఒకరికి 8640/- రూ!! లు. మరిన్ని వివరాలకు 9959226003, 9440018549 లో సంప్రదించాలని డిపోమేనేజర్ కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని ఆ మహశివుని కృపకు పాత్రులు కాగలరు అని ఆయన కోరారు