వినాయక మండలి కమిటీతో ప్రత్యేక సమావేశం
16-09-2026 | 08:12pm
బెజ్జూర్,(విజయక్రాంతి): వినాయక మండల కమిటీ(Vinayaka Mandali Committee)తో అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల(Vinayaka Chavithi Navratri Festival)ను ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఈ నవరాత్రుల్లో వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్మోహన్ రావు, ఎస్సై విజయ్ తదితరులు పాల్గొన్నారు.