ఇప్పుడు కాకపోతే అంతే!

25-09-2026 | 05:00am

ఓబీసీలమంతా ఏకమవుదాం

రిజర్వేషన్లు సాధించుకుందాం 

ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు 

హైదరాబాద్,సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రిజర్వేషన్ల పెంపు, జనగణనలో ప్రత్యేక కాలం చేర్చే అంశంపై బీసీ కులాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు(Government Advisor V. Hanumantha Rao) అన్నారు. ఓబీసీలకు అండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉంటారని పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఓబీసీ రిజర్వేషన్ల పెంపు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదనీ అన్నారు. అందు కే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

అవసరమైతే పార్లమెంటును ముట్ట డించేందుకైనా సిద్ధంగా ఉండాలని వీహెచ్ పిలుపునిచ్చారు. 1993లో పీవీ నర్సింహరావు హయాంలో మండలి కమిషన్ ఏర్పా టు చేశారని తెలిపారు. అయినా ఇప్పటివరకు ఓబీసీ లెక్కలే లేవని ఆవేదన వ్యక్తం చేశా రు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు క్రీమిలేయర్ లేదని, ఓబీలకు ఉండటం వల్ల అన్యా యం జరుగుతోందన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం కాక్రోచ్ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఆందోళన చేపట్టిందని తెలిపారు.

బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రాహుల్‌గాంధీ లోక్‌సభ ప్రతిపక్ష నేతగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు వీహెచ్ పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు రేవంత్ రెడ్డి అధికారంలోకి కులగణన చేపట్టారని గుర్తు చేశారు. అయితే, ఆ బిల్లును గవర్న ర్ కోల్డ్‌స్టోరేజ్‌లో పెట్టారని విమర్శించారు. బీసీలకు, అగ్ర కులాల్లో పేదలకు న్యాయం చేయాలని ఇందిరమ్మ కుటుంబం చూస్తుంది. అందుకే రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా 100 రోజుల కార్యక్రమం చేపట్టారని తెలిపారు. వినాయకుల నిమజ్జనం పూర్తికాగానే,  అన్ని మండలాల్లో మీటింగ్ పెట్టి.. ఆ తర్వాత చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు