పాలన చేత కాకుంటే గద్దె దిగు
- సాగునీరు, ఎరువులు అందించడంలో రేవంత్ సర్కారు విఫలం
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 5 (విజయక్రా ంతి): రైతుల(Farmers)కు కరెంటు(electricity), సాగునీరు(irrigation), ఎరువులు(fertilizers) అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Singireddy Niranjan Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వె య్యి రోజుల పాలనకు నిరసనగా శనివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి(Marri Janardhan Reddy) ఆధ్వర్యం లో నాగర్‌కర్నూల్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్ల(farmers tractors)తో భారీ ర్యాలీ నిర్వహించి సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్, రై తుబంధు, విత్తనాలు, ఎరువులు, మద్దతు ధర అందించామని, ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యూ రియా యాప్ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. రైతుల కరెంటు కట్ చేసిన రేవంత్ సర్కార్ను అధికారంలో నుంచి కట్ చేసేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారని అన్నారు.
మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, 420 హా మీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదన్నా రు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే యూరి యా యాప్ను రద్దు చేస్తామని తెలిపారు. ర్యా లీలో సుమారు 200 ట్రాక్టర్లతో రైతులు పా ల్గొని విద్యుత్, సాగునీరు, ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యు త్ శాఖ ఎస్‌ఈకి వినతిపత్రం అందజేశారు.






