మట్టి వినాయక విగ్రహాల తయారీపై ZPHS బేలలో అవగాహన
బేల,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ(Environmental protection)లో భాగంగా PM SHRI ZPHS బేల పాఠశాలలో విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. B. వినోద్ కుమార్, SA ఇంగ్లీష్ విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల తయారీ విధానాన్ని వివరిస్తూ, వారి చేత స్వయంగా విగ్రహాలను తయారు చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ కుమార్ మాట్లాడుతూ, వినాయక చవితి(Ganesha Chavithi) సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించాలని సూచించారు.
POP విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, మట్టి విగ్రహాలు పర్యావరణహితమైనవని తెలిపారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ప్రతి ఒక్కరూ “మట్టి వినాయకుడు – పర్యావరణానికి రక్షణ” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధానోపాధ్యాయులు కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.