ఓటు హక్కు పరిరక్షణకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
ఆసిఫాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): “సేవ్ డెమోక్రసీ వీక్(Save Democracy Week)”లో భాగంగా ఓటు చోరీ(Vote Theft), ఎన్నికల సంఘం(Election Commission) జవాబుదారీతనం, ఓటర్ల జాబితాలో(Voter List) మార్పులు తదితర అంశాలపై తదుపరి కార్యాచరణపై ఇండియా కూటమి నాయకులు(INDIA alliance leaders) శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి ఓటు విలువను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా పునర్విచారణ పేరుతో చేపడుతున్న ఎస్ఐఆర్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం తీరుపై ప్రజల్లో అనుమానాలు ఉన్నందున ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరారు.ఓటు చోరీ, ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆమె విమర్శించారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తారిక్, భీమ్రావు, అర్షత్ హుస్సేన్, సుద్దాల శ్రీనివాస్, జాడీ ప్రసాద్, రత్నం ఆనంద్, రాపర్తి మురళి, ఇమ్రాన్, సీపీఎం నాయకులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, గుడిసెల కార్తీక్, కోరింగ మాల శ్రీ, గేడం టీకానంద్, దుర్గం రాజ్‌కుమార్, దుర్గం నిఖిల్, నితిన్, సాయికుమార్, ఉప్పుల కృష్ణ, సూరజ్, తిరుపతి, రాము, నాగరావు, పెందూరు ప్రకాష్,కాంగ్రెస్, సీపీఎం, ఇండియా కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.