5 September, 2026 | 2:20 PM

బేకరీల్లో మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

05-09-2026 | 11:57am

అచ్చంపేట, సెప్టెంబర్ 5: పట్టణంలోని పలు బేకరీల్లో శనివారం మున్సిపల్ అధికారులు(Municipal officials) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అపరిశుభ్రత, ఆహార పదార్థాల నిర్వహణలో లోపాలు, పాడైపోయిన క్రీమ్స్‌(Spoiled creams)తో పాటు 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన మంజునాథ్ బేకరీకి రూ.1,000, గోల్డెన్ బేకరీకి రూ.2,500, వెంకటేశ్వర బేకరీకి రూ.2,500 చొప్పున జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. బేకరీ నిర్వాహకులు(Bakery managers) పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిషేధిత ప్లాస్టిక్(Banned plastic) కవర్లను వినియోగించవద్దని సూచించారు. తనిఖీల్లో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ గణేష్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు