వాలీబాల్ విన్నర్స్ ఎస్ వి అకాడమీ విద్యార్థులు
ఎర్రుపాలెం సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఎర్రుపాలెం మండల స్థాయి ఆటల పోటీలలో ఈనెల 8, 9వ తేదీల్లో భీమవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలందు జరిగిన వాలీబాల్ అండర్ 14 నందు ఎస్ వి అకాడమీ ఎర్రుపాలెం విద్యార్థులు విన్నర్స్ గా గెలుపొంది మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మురళి చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం జరిగినది. ఈ రోజున పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఎస్ వి అకాడమీ చైర్మన్ మిరియాల శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.... క్రీడలు విద్యార్థులకు శరీర దారుణ్యానికి మానసిక ఉల్లాసానికి మెదడు చురుకుగా పనిచేయటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మన పాఠశాలలో విద్యతోపాటుగా ఆటల పోటీలకు ప్రత్యేకమైన పిఈటిలతో శిక్షణనిస్తూ మండలంలో ఆటల పోటీ నందు ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొంది ఈ రోజున మండల స్థాయిలో ఛాంపియన్స్ గా నిలిచిన విద్యార్థులను, ఈ పోటీలకు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ వి అకాడమీ ప్రిన్సిపాల్ తొండ సతీష్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు