ఏసీబీకి పట్టుబడిన తహసీల్దార్

19-09-2026 | 05:00am
  1. భూమి పౌతి మార్పిడి కోసం రూ.14వేలు డిమాండ్ 
  2. ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఉదంతం  

ములుగు/చర్ల, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): తల్లి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని(Agricultural land) కుమార్తె పేరు మీద మార్చేందుకు 14వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి గోవిందరావుపేట తహసీల్దార్ నెల్లుట్ల సృజన్‌కుమార్(Nellutla Srujan Kumar) అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య(ACB DSP Sambaiah) కథనం ప్రకారం ములుగు జిల్లా(Mulugu District) గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన ఒక మహిళ ఏప్రిల్‌లో మృతిచెందగా ఆమె కుమార్తె మే నెలలో మీసేవ ద్వారా వ్యవసాయ భూమి మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

నాలుగు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం(Tahsildar Office) చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదు. ఈ క్రమంలో బాధితురాలు తహసీల్దార్‌ను కలవడంతో ఆయన 15 వేల రూపాయలు లంచం ఇస్తేనే భూమి మార్పిడి చేస్తానని స్పష్టం చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ మహిళ ఏసీబీని ఆశ్రయించగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో 14 వేల రూపాయలు డబ్బులు ఇస్తున్న క్రమంలోనే వల పన్ని పట్టుకున్నారు.  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో..  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నీ సత్యనారాయణపురం ఎస్‌టీ బాలర హాస్టల్ వార్డెన్ వాల్సింహ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. అవినీతి నిరోధక శాఖ అధికారి వై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర వసతి గృహంలో వంట మనిషికి జీతం చెల్లించేందుకు వార్డెన్ రూ 20వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో మంటమనిషి ఏసీబీని ఆశ్రయించి శుక్రవారం రూ 14 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీఈ అధికారులకు చిక్కాడు.

మరిన్ని వార్తలు