తత్వం కథే మా ధైర్యం

30-09-2026 | 05:10am

దినేశ్‌తేజ్(Dinesh Tej), దష్విక కే(Dashvika K) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తత్వం(Tathvam)’  అర్జున్ కోలా దర్శకత్వంలో త్రయతి ఇషాని క్రియేషన్స్(Trayati Ishani Creations), ఎస్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్లపై శీమకుర్తి వంశీకృష్ణ, శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న థ్రియేటికల్ విడుదలకు సిద్దమైన ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుక(Movie pre-release ceremony) మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో దినేశ్ తేజ మాట్లాడుతూ.. “కొత్తదనం ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. తప్పకుండా ఈ సినిమాకూ అదే కోవలో విజయాన్ని ఇస్తారని అనుకుంటున్నా. ఈ సినిమాకు కథే మా ధైర్యం, ప్రేక్షకులే మా బలం.

ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే మా అందరిలో కూడా నమ్మకం కలుగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ అందరి మనసులను తాకుతుంది” అన్నారు. ‘తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది. మా అందరికి ప్రేక్షకుల ప్రోత్సాహం ఉంటుందని అనుకుంటున్నాన’ని హీరోయిన్ దష్విక తెలిపింది. దర్శకుడు అర్జున్ కోలా మాట్లాడుతూ.. “ఈ సినిమా సమయంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. దీంతో మళ్లీ మేము వచ్చి సినిమా విడుదల చేస్తామని ఎవరూ అనుకోలేదు. ప్రమోషన్స్ ప్రారంభించే సమయంలో హీరో, హీరోయిన్ కారు యాక్సిడెంట్‌కు గురయ్యారు. వాళ్లు కోలుకునే సరికి టైమ్ పట్టింది. ఇప్పుడు దాదాపు డజను సినిమాలు విడుదలవుతున్నాయి.

అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో మా సినిమాను విడుదల చేస్తున్నాం. అక్టోబర్ 2న ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్‌తో మా కష్టాలన్నీ మరిచిపోతాం” అని చెప్పారు. నిర్మాత శీమకుర్తి వంశీకృష్ణ మాట్లాడుతూ.. “మేము వెండితెరపై ఈ సినిమా చూసి, ప్రేక్షకుల స్పందన చూసి మా కష్టాలు మరిచిపోతాం” అన్నారు. సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. “తత్వం’ సినిమాను ఎవరూ మిస్ కాకండి. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఇలాంటి సినిమాను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది” అని తెలిపారు. 

మరిన్ని వార్తలు