హెచ్​సీఏవి అక్రమ, అనైతిక విధానాలు: టీసీఏ

25-09-2026 | 05:15am

జిల్లా ప్రతిభ నిర్లక్ష్యంపై ఆగ్రహం

వినూ మన్కడ్ ట్రోఫీకి జట్టు ఎంపికపై విమర్శలు

ప్రతిభ లేనివారిని ఎంపిక చేశారన్న గురువారెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 24: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) కార్యదర్శి జీవన్ రెడ్డి, మీడియా ఇన్‌చార్జి టి. శేషనారాయణ్, సీఈవో ఇంతియాజ్ ఖాన్ ఇటీవల చేసిన ప్రకటనలకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైనట్లు హెచ్ సీఏ సెక్రటరీ జీవన్ రెడ్డి చేసిన ప్రకటన భారత క్రికెట్ చరిత్రలోనే ఈ దశాబ్దంలోనే అ త్యంత హాస్యాస్పదమైన జోక్‌గా టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి(TCA Secretary Guruva Reddy) అభివర్ణించారు.

అసలు ఎ వరూ వివరణ ఇవ్వమని అడగకపోయినా, ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వ చ్చిందనీ ప్రశ్నించారు. బీసీసీఐ ఆయనను ఎలా అనుమతించిందనీ, ఏ నిబంధన కింద అనుమతించిందనీ, ఆయన నిజంగా ఓటు వేశారా లేదా అన్నదానికి హెచ్‌సీఏ ఆధారాలను బయటపెట్టాలనీ డిమాండ్ చేశారు. తెలంగాణ అంతటా క్రికెట్‌ను అభివృద్ధి చేస్తున్నామన్న హెచ్‌సీ ఏవాదనను కూడా టీసీ ఏ తీవ్రంగా తప్పుపట్టింది. జిల్లా క్రీడాకా రులకు న్యాయం చే స్తున్నామన్న హెచ్ సీ ఏ వాదనలో నిజం లే దని పేర్కొంది.

గణాంకపరమైన ప్రతిభ ఉన్నప్పటికీ, అ నేక మంది అత్యుత్తమ గ్రామీణ క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందనీ ఆరోపిం చింది. వినూ మన్కడ్ ట్రోఫీకి జట్టు ఎంపిక సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. రోహన్ బొ ప్పన్న, దేవ్ ఎం. మెహతా, పార్థ్ శర్మ, ఉజైర్ అహ్మద్ లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశా రో చెప్పాలన్నారు.

అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నిపుణ్ రెడ్డి అనే యువ క్రికెటర్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేయ డం ఏంటని గురువారెడ్డి మండిపడ్డారు. గత ఏడాది వినూ మన్కడ్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన నిపు ణ్ రెడ్డి ఇటీవల సెలెక్షన్ ట్రయల్స్‌లో రాణించాడు. టీ ట్వంటీ కప్, హెచ్‌సీఏ లీగ్, అండర్ 19 సెలెక్షన్ సూపర్ 6, బెంగాల్ అండర్ 19 జట్టుపైనా కలిపి మొత్తం 33 వికెట్లు, 230 పరుగులు చేశాడనీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు, ఎవరిని ఎందుకు విస్మరిస్తున్నారు అనే అంశంపై గురువా రెడ్డి ప్రశ్నలు సంధించారు.

మరిన్ని వార్తలు