5 September, 2026 | 2:21 PM

ఎస్‌జేకేఎం కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

05-09-2026 | 12:12pm

ఎర్రుపాలెం, సెప్టెంబర్‌ 5 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎస్‌జేకేఎం(SJKM) కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్‌ అధ్యాపకులు, కళాశాల యాజమాన్య సభ్యులైన మిరియాల శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ.. కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని, అలాంటి ఆశయాలకు మార్గం చూపేవాళ్లే గురువులని అన్నారు. అలాంటి గురువులను ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్‌(Sarvepalli Radhakrishnan) పేరు మీద ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం విద్యార్థుల అదృష్టంగా భావించాలని తెలిపారు.

నేటి సమాజంలో జరుగుతున్న అనేక కారణాలను విశ్లేషించుకుంటూ, భవిష్యత్తుకు గురువులు చెప్పే పాఠ్యాంశాలతో పాటు పలు సూచనలను అందుకొని జీవితంలో వెలుగులు నింపుకొని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. కళాశాల యాజమాన్యం అధ్యాపకులను ఘనంగా శాలువాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ నాగిరెడ్డి సౌజన్య, నాగిరెడ్డి రమేష్‌, ఐలూరి శ్రీనివాసరెడ్డి, గద్దల శ్రీనివాసరావు, గద్దల సత్యనారాయణ, సురేష్‌, రవి, భూక్య గోపి, కోటేశ్వరరావు, ఎస్కే రెహమ, సుస్మిత, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు