అంబేద్కర్ సంఘం ఎన్నిక రద్దు

04-10-2026 | 04:47pm

జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్

ముకరంపుర, అక్టోబర్ 4(విజయ క్రాంతి) : కరీంనగర్ కార్పొరేషన్(Karimnagar Corporation) రెండో డివిజన్ తీగలగుట్టపల్లిలోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్(Kyadasi Prabhakar) ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికైన నూతన కమిటీ బీఆర్ఎస్ ప్యానెల్(New Committee: BRS Panel) గా చెప్పుకుంటూ స్థానిక పార్టీ ముఖ్య నాయకులను కలిసి, సన్మానం అందుకున్నట్లు సోషల్ మీడియాలో పలు చోట్ల పోస్ట్ చేయడం జరిగిందని కుల సంఘం ఎన్నికలకి రాజకీయ పార్టీలను జోక్యం చేయడమనేది సంఘం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం.

కాబట్టి  బీజెపీ ప్యానెల్ పై బీ ఆర్ఎస్ ప్యానెల్ గెలిచిందని చెప్పడం సరైన పద్ధతి కాదని  ఈ విషయంపై జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ వెంటనే విచారణ జరిపించి   సంఘం ప్రతిష్ట కు భంగం కలిగించిన నూతన కమిటీపై క్రమశిక్షణ చర్యల్ని తీసుకోవాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు నూతన కమిటీ సకాలంలో వివరణ ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినందుకు చర్యగా ఎన్నికైన కమిటీని పూర్తిగా రద్దు చేయడం జరిగిందని జిల్లాధ్యక్షుడు ప్రభాకర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు