ఆర్య వైశ్య మహాసభ భవన శంకుస్థాపన విజయవంతం చేయాలి

11-09-2026 | 02:33pm

తుంగతుర్తి (విజయ క్రాంతి): ఈ నెల 13న హైదరాబాద్ ఉప్పల్ బాగాయత్(Uppal Bhagayat)లో గత కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్య వైశ్య భవన సముదాయ నిర్మాణానికి కేటాయించిన 5 ఎకరాల భూమి లో నూతనంగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టినారు. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్ది హాజరగుతున్నారు. అలాగే అమరవాది లక్ష్మినారాయణ  రాష్ట్ర మహాసభ అధ్యక్షులతో పాటు వైశ్య ప్రముఖులు.. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరగుతున్నందున మండలంలోని వైష్యులందరు విధిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈగ నాగన్న ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆర్యవైశ్య రాజకీయ వైస్ చైర్మన్ తాటికొండ సీతయ్య, ఈగ లక్స్మయ్య. పాలారపు సంతోష్.బండారు దయాకర్ ఓరుగంటి శ్రీనివాస్, శరివిరాల మల్లయ్య. ఈగ శ్రీనివాస్  కాసం రాములు. తల్లాడ శ్రీనివాస్, బచ్చు వెంకటేశ్వర్లు, ఆమంచి సోమన్న. బండారు నాగన్న. గుమ్మడ వెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు

మరిన్ని వార్తలు