ట్రాక్టర్లతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

11-09-2026 | 10:55am

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ(Telangana Assembly) సమావేశాలు ఐదో రోజూ ప్రారంభమై కొనసాగుతున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad) ప్రశ్నోత్తరాలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు రెండు ట్రాక్టర్లతో అసెంబ్లీకి వెళ్లారు. రైతులకు ఫసల్ బీమా యోజనను(Pradhan Mantri Fasal Bima Yojana) రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్(MLA Quarters) నుండి అసెంబ్లీ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అసెంబ్లీ గేటు దగ్గర పోలీసులు వారిని అడ్డుకున్నారు.

మరిన్ని వార్తలు