ఫిరాయింపులకు బ్రేక్ పడేనా!?
ప్రజల తీర్పుతో గెలిచిన పదవి..- పార్టీ మారగానే వ్యక్తిగత ఆస్తిగా మారిపోతుందా? ప్రజలు ఒక గుర్తును చూసి, సిద్ధాంతాలను నమ్మి ఓటేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధి, ఆ తర్వాత మరో పార్టీ గూటికి చేరితే ఆ ఓటు విలువ ఏమైపోతోంది?.. ప్రస్తుత రాజకీయాల్లో తరచూ ఎదురవుతున్న ఈ ప్రశ్నకు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ సమాధానం చెప్పాల్సి ఉంది. నిబంధనల అమలులో జాప్యం, రాజకీయ ప్రయోజనాలు, స్పీకర్ నిర్ణయాలపై వివాదాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల అంశం మళ్లీ చర్చ నీయాంశమైంది.
ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత విషయంలోతెలంగాణ హైకోర్టు(Telangana High Court's) ఇ చ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఈ చర్చకు మరింత ప్రా ధాన్యం ఏర్పడింది. 2023 అసెం బ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దానం 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీచేశారు. ఈ నేపథ్యంలో దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. 2024 ఏప్రిల్ 23 నుంచి సభ్యత్వం చెల్లదని పేర్కొంది. సెప్టెంబర్ 24న సుప్రీం కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.
పదో షెడ్యూల్ ఉన్నా.. అమలు ఎక్కడ?
పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు రాజ్యాంగంలో 1985లో పదో షెడ్యూల్ ప్రవేశపెట్టారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం లేదా నిర్దిష్ట పరిస్థితుల్లో పార్టీ విప్‌కు విరుద్ధంగా ఓటు వేయడం వంటి సందర్భాల్లో అనర్హతకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే ఆచరణలో ఫిరాయింపులపై నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగితే చట్టం ఉద్దేశమే బలహీనపడుతుంది.
దానం తీర్పు.. మిగిలిన కేసులపై ఆసక్తి
దానం నాగేందర్ విషయంలో హైకోర్టు సెప్టెంబర్ 18న స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి అనర్హత వేటువేసింది. ఈ తీర్పు ఇతర ఫిరాయింపు కేసులపై కూడా న్యాయపరమైన చర్చకు దారితీసింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆ రోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణలు సాగుతు న్నాయి. అయితే దానం నాగేందర్ కేసులో వచ్చిన తీర్పును మిగిలిన ప్రతి కేసుకూ యాంత్రికంగా వర్తింపజేయడం సరికాదు. ప్రతి కేసులో ఉన్న వాస్తవాలు, ఆధారాలు, న్యాయపరమైన అంశాలను విడివిడిగా పరిశీలించాల్సిందే. ఇదే న్యాయవ్యవస్థలోని సహజమైన ప్రక్రియ.
ప్రజల ఓటు విలువే ప్రజాస్వామ్యానికి పునాది
పార్టీ ఫిరాయింపుల చర్చలో రాజకీయ పార్టీలన్నింటికీ ఒకే ప్రమాణం వర్తించాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధానం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధానం అనుసరించడం ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఎర్ర గురివిందకు తన ఎరుపు తెలియదు అన్న సామెతలా, తమనుతాము తాము చేసినప్పుడు సమర్థించుకునే ద్వంద్వ వైఖరికి రాజకీయ వ్యవస్థ దూరంగా ఉండాలి.
ఎన్నికల్లో ప్రజలు ఒక అభ్యర్థిని, ఒక పార్టీ గుర్తును, ఒక విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఓటు వేస్తారు. ఆ తీర్పు తర్వాత ప్రజాప్రతినిధి పార్టీ మారితే, ఆ చర్యకు రాజ్యాంగపరమైన పరిణామా లు ఉండాలా? ఉంటే వాటిని నిర్ణీత కాలంలో, పారదర్శకంగా అమలు చేయాలా? అనే ప్రశ్నలకు చట్టపరమైన వ్యవస్థ స్పష్ట మైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పార్టీ ఫిరాయింపులు పూర్తిగా ఆగిపోవా లని చెప్పడం కంటే, పార్టీ మా రితే చట్టం ఏం చెబుతోంది? అనే దానిపై స్పష్టత అవసరం.
సామాజిక విశ్లేషకులు, వరంగల్, 9573666650