ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: స్పీకర్‌ను దూషించారనే కేసులో ఎమ్మెల్సీలు తాతా మధు(tata madhu), నవీన్ రెడ్డి(Naveen Reddy)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. తాతా మధు, నవీన్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ గతంలో నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా పోలీసుల తరఫున పీపీ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్‌ను ఇద్దరు ఎమ్మెల్సీలు అసభ్య పదజాలంతో దూషించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై కూడా దాడి చేశారని పేర్కొన్నారు. పోలీసుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తాతా మధు, నవీన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన తదుపరి విచారణలో వారి వాదనలు విననుంది.