కుమ్మర్లకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి

04-10-2026 | 07:39pm

తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షులు నడికుడి.జయంత్ రావు. 

నేరేడుచర్ల అక్టోబర్ 04(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని కుమ్మరులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తెలంగాణ కుమ్మర సంఘం(Telangana Kummara Association) రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంత్ రావు అన్నారు. నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో ఆదివారం కుమ్మరి సంఘం సమావేశం నిర్వహించారు. నేరేడుచర్ల పట్టణ కుమ్మర సంఘం కమిటీని(Nereducherla Town Potters' Association Committee) ఎన్నుకున్నారు. పట్టణ కమిటీ అధ్యక్షులుగా నిమ్మన గోటి మల్లయ్య ప్రధాన కార్యదర్శి పోరండ్ల కృష్ణయ్య, గౌరవాధ్యక్షులుగా సిరికొండ పాపయ్య గౌరవ సలహాదారులుగా సరికొప్పులు నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడిగా మల్లికంటి శ్రీను మలికంటి సత్యనారాయణ కోశాధికారిగా మొగిలిచర్ల అనిల్ సహాయ కార్యదర్శిగా సిరికొండ ఆదినారాయణ రాచకొండ సందీప్ ప్రచార కార్యదర్శులుగా సిలువేరు నాగార్జున తీగుళ్ల కొండలు అర్రురి  శ్రీను లను ఎన్నుకున్నారు.

సూర్యాపేట జిల్లా  హుజుర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల పట్టణ కమిటీ ఈ రోజు  నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టం సంజీవరావ్ సభా అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షులు  నడికుడి జయంత్ రావు  నాయకత్వంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశ్వర్లు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి మల్కాజిగిరి దయానంద్,రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగము రాష్ట్ర కమిటీ సూచనలతో జిల్లా కన్వీనర్ సలిగంటి శ్రీనివాస్, జిల్లా కమిటీ సూచనలతో పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ సలిగంటి శ్రీనివాస్ హుజుర్నగర్ నియోజకవర్గ ఇంచార్జి గొట్టం సంజీవరావ్ , కో కన్వీనర్ మాసంపల్లి సైదులు, కో కన్వీనర్ ఖమ్మంపాటి మధుసూదన్,సూర్యాపేట ఇంచార్జి సలిగంటి వీరేంద్ర ల సమక్షంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

మరిన్ని వార్తలు