పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన తెలంగాణ ప్లేయర్స్
- 13 పతకాలు కైవసం
- అత్యుత్తమ ప్రదర్శన నమోదు
హైదరాబాద్, సెప్టెంబర్ 7 : వియత్నాంలో జరిగిన హీనెకెన్ పికిల్‌బాల్ వరల్డ్ కప్(Heineken Pickleball World Cup) 2026లో హైదరాబాద్(Hyderaba)కు చెందిన పలువు రు క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో భారత్(India)కు పతకాలు అందించి అంతర్జాతీయ వేదిక(International platform)పై సత్తా చాటారు. ఏకంగా 13 పతకాలు తెలంగాణ పికిల్‌బాల్ క్రీడాకారులే(Telangana Pickleball players) గెలిచా రు. వీటిలో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. దాదాపు 80 దేశాలకు చెందిన 4900 పైగా క్రీడాకారులు(Athletes) ఈ టోర్నీలో పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెం దిన మాజీ నేషనల్ టెన్నిస్ ప్లేయర్ వివేక్ రెడ్డి, 40 ప్లస్ పురుషుల సింగిల్స్ విభాగం లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు.
ఫైనల్ పోరులో వియత్నాం నంబర్ వన్ ప్లే యర్ హోంగ్ న్గుయెన్ను ఓడించి ఈ ఘనత సాధించారు.వివేక్ రెడ్డి తన విజయసంతోషాన్ని పంచుకుంటూ భారతదేశానికి ప్రాతి నిధ్యం వహించి, ప్రపంచ వేదికపై స్వర్ణం గెలవడం గర్వించదగ్గ క్షణమన్నారు. వివేక్ రెడ్డితో కలిసి జోడీగా ఆడిన హైదరాబాద్ ప్లేయర్ శ్రీకర్ మోతుకూరి, 40 ప్లస్ పురుషుల డబుల్స్ విభాగం లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో ఫ్రా న్స్, చిలీ జోడీలపై వీరు విజయం సాధించారు.
హైదరాబాద్‌కు చెందిన మరో పికిల్ బా ల్ క్రీడాకారుడు తుమ్మల నవీన్ సైతం ప్ర పంచకప్‌లో మెరిశారు. ఆయన 50 ప్లస్ సింగిల్స్ విభాగంలో అద్భుతమైన ఆటతీరును కనబరిచి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరితో పాటు ప్ర శాంతి, విశాల్ చౌదరి, సంజన, ఆశ్రిత, శ్రీక ర్, దియా పలు విభాగాల్లో మెడల్స్ సాధించారు. ఈ గెలు పులు తెలంగాణకు ఎంతో గర్వకారణమని పికి ల్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ విష్ణువర్ధ న్ అన్నారు. భారత్ జట్టు గెలిచిన మెడ ల్స్‌లో ఎక్కువ శాతం తెలంగాణ ప్లే యర్స్ పాత్ర ఉండడం సంతోషంగా ఉందన్నారు.