తెలంగాణ రైలు @ గోల్డెన్ జూబ్లీ

04-10-2026 | 05:20am

హైదరాబాద్ (నాంపల్లి): న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Telangana Superfast Express ) ట్రైన్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 12723/24 నెంబర్ రైలు 1976 అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎక్స్‌ప్రెస్‌తో పట్టాలెక్కిన ఈ రైలు తెలంగాణ ఆవిర్భావంతో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పేరు రూపాంతరం చెందింది. శనివారంతో ఈ రైలు సేవలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.

1,667 కిలోమీటర్లు ప్రయాణం సాగించే ఈ రైలు హైదరాబాద్‌లో ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. తిరుగు పయనంలో న్యూఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు బయలుదేరే ఈ రైలు, మరుసటి రోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ చేరుతుంది. నిరంతరాయంగా 50ఏళ్ల పాటు సుదీర్ఘంగా ప్రయాణికులకు సేవలందిస్తూ ‘బ్లూ బుల్లెట్’ ట్రైన్‌గా పేరు గడించింది. 

బండి సంపత్‌కుమార్ 



మరిన్ని వార్తలు